Vibhajana Katha, Dairyloo Konni Peejiilu
Vundavalli Arunkumar
Sozialwissenschaften, Recht, Wirtschaft / Politikwissenschaft
Beschreibung
చిన్నమాట
రాష్ట్ర విభజనానంతరం, నా మిత్రులు సౌమ్యం గానూ.. విరోధులు కఠినంగానూ నా మీద చేస్తున్న ఆరోపణ ఒకటే..!
25-1-2013 రాజమండ్రి బహిరంగ సభ మొదలుకుని 20-2-2014 రాజ్యసభలో కూడా రాష్ట్ర విభజన జరిగిపోయేదాకా ఉండవల్లి ఎక్కడ మాట్లాడినా "బిల్లు పాసవ్వదు" "బిల్లు పాసవ్వదు" అంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూనే వచ్చాడు! దీనికేం సమాధానం చెప్తాడు. - అని!!
దీనికి నేనిచ్చే సమాధానం ఒక్కటే... 'బిల్లు పాసవదు' అన్నాను 'బిల్లు పాసవ్వలేదు'
18-2-2014 తేదిన లోక్ సభలో బిల్లు పాసయ్యే పరిస్థితే వుంటే, తలుపులెందుకు మూసేస్తారు... టివి ప్రసారాలను ఎందుకు ఆపు చేస్తారు... ఎంతమంది అనుకూలమో, ఎంతమంది వ్యతిరేకమో.. లెక్క కూడా పెట్టకుండా 'అయిపోయింది' అని ఎందుకు ప్రకటించేస్తారు!?
లోక్ సభలో జరిగిన 'ప్రహసనం' చదవండి.. మీకు అర్థం అవుతుంది, బిల్లు పాసవ్వలేదని...
20-1-2011 న శ్రీకృష్ణ కమిటీ నివేదికను రాజకీయ పార్టీలకు చిదంబరం అందించిన రోజునుండి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 'తెలంగాణ' రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం చేసిన నాటి వరకు, ఆ తరువాత పార్లమెంటులో విభజన బిల్లు పాసయ్యే వరకు ఏం జరిగిందో, అందులో నా పాత్ర ఏమిటో నా డైరీలో నమోదు చేశాను. చదవండి.
అయితే ఈ డైరీలోకి వెళ్ళేముందు వేర్పాటువాదం చరిత్ర, పూర్వాపరాలు కూడా తెలుసుకోవడం అవసరం. అందుకే ముందు సంక్షిప్తంగా పూర్వ చరిత్ర అందిస్తున్నాను.
- ఉండవల్లి
Kundenbewertungen
politics, Kasturi vijayam, Andhrapradesh vibhajana