Kasturi Vijayam-Sahiti Mudralu (Telugu)
Sudheer Reddy Pamireddy
Geisteswissenschaften, Kunst, Musik / Allgemeine und Vergleichende Literaturwissenschaft
Beschreibung
ఏ భాషా సాహిత్యమైనా ఆయా కాలమాన పరిస్థితులను స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. సాహిత్యంలో రచయిత యొక్క శిల్ప, వస్తు, శైలీ విశ్లేషణలే కాకుండా ఆయా సందర్భాల యొక్క సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలను కూడా కవులు, రచయితలు వారి రచనల ద్వారా పాఠకులకి అందిస్తారు. ఇలాంటి రచనల ద్వారానే పాఠకులు ఒక కాలం యొక్క కవులను గూర్చి గానీ, ఆ కవులు లేవనెత్తిన సామాజిక, సాంస్కృతిక, రాజకీయ సమస్యలను గానీ, పాఠకులు వారి వారి వివేక, వివేచనా అనుసారం తెలుసుకుంటారు. ఏ భాషా సాహిత్యమూ దీనికి అతీతము కాదు. ఒకకవి గానీ, రచయిత గానీ వారి రచన ద్వారా ఏం చెప్పాలకుంటున్నారు అనేది పాఠకుడు సులవుగానే గ్రహిస్తాడు. పాఠకునికి చదివించే ఆసక్తి, పాఠకుణ్ణి ఆలోచింప చేయగలిగే రచనలు చిరకాలం వర్ధిల్లుతాయి. అటువంటి రచనల ద్వారానే ప్రాచీన, ఆధునిక సాహిత్యంలోని సామాజిక పరిస్థితులను గాని, రాజకీయ పరిస్థితులను గాని పాఠకుడు విమర్శ, విశ్లేషణ చేయగలిగే జ్ఞానాన్ని పొందుతాడు. అయితే ఏ రచయితైనా వారు పుట్టి పెరిగిన పరిసరాలకు, పరిస్థితులకు అతీతంగా రచనలు చేయలేరు. అలా చేసిన రచనలు అంతగా పాఠకుల మీద ప్రభావం చూపవు కూడా. ఏ రచయితా భావోద్వేగాలకు అతీతుడు కాదు. ఈ భావోద్వేగాల విచక్షణ వారి వారి రచనల ద్వారా పాఠకులకు చేరవేయడం వారి సామాజిక బాధ్యతగా కూడా రచయితలు భావిస్తుంటారు.
అటువంటి వ్యాసాలే ఈ "కస్తూరి విజయం- సాహితీ ముద్రలు" లో రచయితలు పొందుపరచారు.
Kundenbewertungen
Telugu Literature, Literary Collections