HasyaVallari (Telugu)
Kothapalli Ravi Kumar
* Affiliatelinks/Werbelinks
Links auf reinlesen.de sind sogenannte Affiliate-Links. Wenn du auf so einen Affiliate-Link klickst und über diesen Link einkaufst, bekommt reinlesen.de von dem betreffenden Online-Shop oder Anbieter eine Provision. Für dich verändert sich der Preis nicht.
Belletristik/Erzählende Literatur
Beschreibung
నవ్వితే నవరత్నాలు రాలతాయో లేదో కానీ.. నవ్వితే శరీరంలోని 108 కండరాలు ఉత్తేజితమై శక్తి వస్తుంది. నవ్వితే ముఖంలో కండరాలు ప్రత్యేకమైన బ్రెయిన్ న్యూరో ట్రాన్స్‌మీటర్లను ఉపయోగించుకుంటాయి. చాలామంది నిపుణులు చెప్పేదేంటంటే, నవ్వుతో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చునని. మనస్ఫూర్తిగా నవ్వడం వలన సంతోష పూరిత హీలింగ్ హార్మోన్లు విడుదల అవుతాయి. అందుకే నవ్వడం వల్ల నిత్య యవ్వనంగా కనిపిస్తారు. గట్టిగా నవ్వడం వల్ల మన శరీరానికి ఆక్సిజన్ బాగా అందుతుంది. దీనివల్ల గుండె సంబంధిత రోగాలు దరిచేరవు. అందుకే ఇప్పుడు చాలా చోట్ల లాఫింగ్ క్లబ్ లు విరివిగా వెలుస్తున్నాయి. డిప్రెషన్‌లో ఉన్నవాళ్లకు లాఫింగ్ థెరపీ ట్రీట్‌మెంట్ చేయగా 70 శాతం వరకు సత్ఫలితాలు ఇచ్చాయని ప్రముఖ వైద్యుల రిపోర్ట్. అందుకే బాధలన్నీ పక్కన పెట్టేసి హాయిగా నవ్వేద్దాం!అసలు సిసలైన హాస్యాన్ని పండించి మనల్ని కడుపుబ్బా నవ్వించే రచయితలు, కథకులు ఇప్పటికీ లేకపోలేదు. వారి వారి పదునైన, శాస్త్రీయమైన, ఆరోగ్యకరమైన హాస్యాన్ని పండిస్తూనే ఉన్నారు. మనల్ని నవ్విస్తూనే ఉన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని అసభ్య పదజాలాలు లేని స్వచ్ఛమైన హాస్యాన్ని అందించడానికి పూనుకున్నాను. ఆ హాస్యంతోనే ఈ "హాస్య వల్లరి" ని మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. నా పరిధి మేరకు మంచి హాస్యాన్నే అందించానని నేను అనుకుంటున్నాను. ఇందులో హాస్య కథలతో పాటు నానో హాస్య కథలు కూడా అందించడం జరిగింది. మీరు నా ఈ "హాస్య వల్లరి" ని చదివి, మీరు మనసారా ఆనందించండి
Kundenbewertungen
Comedy Stories, Humorous