img Leseprobe Leseprobe

Dari-Daapu

Nibaddata-Nimagnatalapai aalokana (Telugu)

Rachapalem Chandra Sekhara Reddy

EPUB
ca. 6,49

Kasturi Vijayam img Link Publisher

Belletristik/Erzählende Literatur

Beschreibung

"రచయిత-నిబద్ధత"అనే వ్యాసం రాయడానికి ప్రేరకులు కడప ఆకాశవాణి బాధ్యులు డా. తక్కోలు మాంచి రెడ్డిగారు. ఆ వ్యాసాన్ని ఆంధ్రజ్యోతిలో ప్రచురించి అలాంటివ్యాసాలు మరికొన్ని రాయమని ప్రోత్సహించిన మిత్రుడు పొనుగోటి కృష్ణారెడ్డి గారు. అప్పటినుండి గత ముప్ఫై ఏళ్ళలో అనేక సాహిత్య భావనలు మీద నేను రాసిన వ్యాసాలు సంపుటి ఇది. ఇందులో కొంతభాగాన్ని నా పూర్వ విద్యార్థి, ఇప్పటి తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్ 2008లో నేను అధ్యాపకుడుగా ఉద్యోగవిరమణ చేసినప్పుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి "దరి-దాపు" అనే పేరుతో ప్రచురించాడు.నేను నేర్పిన నాలుగక్షరాలు అంతవిలువైనవని నాకు అప్పుడు అర్థమైంది. రచయితల నిబద్ధత గురించి నేను వ్యాసం రాసే నాటికి దాని మీద అప్పటికే చాలా చర్చ జరిగిందనే విషయం నాకు తెలియదు. తర్వాత తెలిసింది దానిని గురించి తెలుగులోనే గాక, భారతీయ భాషలలో అనేకులు చర్చించారని. అందువల్ల వారి అభిప్రాయలను కొన్నింటిని ఆ వ్యాసం చివర్లో చేర్చాను. "సమాజగమనం-సాహితీసాక్ష్యం"అనే వ్యాసాన్ని చదివి ప్రజాసాహితి సంపాదకుడు నిర్మలానంద్ గారు "నేను థ్రిల్ ఫీలయ్యాను" అనడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది.  గౌరీశంకర్ ప్రచురించినప్పుడు ఈ పుస్తకంలో తొమ్మిది వ్యాసాలు..ఆతర్వాత మరో అయిదు ఈ పుస్తకంలో చేరాయి. ఈ పుస్తకాన్ని ప్రచురించడానికి మిత్రులు పామిరెడ్డి సుధీర్ రెడ్డి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఈ పుస్తకప్రచురణలో భాగస్వాములైన కస్తూరి విజయం సభ్యులకు, పద్మజ పామిరెడ్డి గారికి,డా. మాధవి మిరప గారికి, పామిరెడ్డి సుధీర్ రెడ్డి గారికి.(మలేషియా)...ఈ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. రాచపాళెం చంద్రశేఖరరెడ్డి.



Kundenbewertungen

Schlagwörter

Telugu Literature, Compitative Literture, Literary Criticism