img Leseprobe Leseprobe

Vistruti

Vyasa Bhushanam (Telugu)

Bhamidipati Goury Shankar

EPUB
ca. 5,49

Kasturi Vijayam img Link Publisher

Belletristik/Erzählende Literatur

Beschreibung

వ్యాస రచనలపై శ్రద్ధ కనబరిచేవారి సంఖ్య తగ్గుతుందనే చెప్పాలి. విశ్వవిద్యాలయ పరిధిలో నిర్వహించే సదస్సులపై యుజిసి కాస్త వెనక్కు తగ్గడంతో జాతీయ, అంతర్జాతీయ సదస్సుల నిర్వహణ గత దశాబ్దకాలంగా తగ్గిందనే చెప్పాలి. కళాశాలలు అటానమస్ హెూదాలో వీటని నిర్వహించవలసి ఉన్నా నామ మాత్రమంగానే ఇవి కొనసాగుతున్నాయి. అయినప్పటికీ వ్యాసరచయితలు అరకొఱగానే వ్యాస రచనలు చేస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం! ఏవైనా సంస్థలు వీటని నిర్వహిస్తున్నా దానికి విలువ లేదని ఐఎఎన్ సంఖ్యతో వచ్చేవి పెద్దగా ఉపయోగం ఉండవనే మాటలు వింటున్నాం! అసలు ఒక వ్యాసం తయారుచేయడానికి చేయవలసిన కృషి ఎంతవరకు రచయిత సాగిస్తున్నారు అనేది సందేహంగానే కనిపిస్తుంది. వ్యాసానికి అంశం తీసుకున్న రచయిత విషయ సేకరణలో పడే అవస్థలు వర్ణనాతీతం.

పరిశోధకులకు సాహితీ వ్యాసాలు చాల ప్రయోజనకారిగా నిలుస్తాయి. భమిడిపాటి గౌరీశంకర్ వంటి సీనియర్ వ్యాసకర్తలు చేసే రచనా వ్యాసాంగం నేటి కాలంలో పిహెచ్ఐ, పోస్ట్ డాక్టరేట్ చేసేవారికి మార్గ దర్శకంగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. ప్రాచీన, సమకాలీన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి భమిడిపాటి చేసిన రచనలు ఆమూలాగ్రం ఆలోచింపజేస్తున్నాయి. ఎన్నో సందేహాలకు ఈయన వ్యాసాలు సమాధానాలను అందిస్తాయనడంలో సందేహం లేదు.


Kundenbewertungen

Schlagwörter

Telugu Literature, Literary Collections